
మండపేట :
వృత్తి విద్యను అభ్యసించడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఒకేషనల్ ట్రైనర్ వై.యస్. రాజు తెలిపారు. మండపేటలోని శ్రీ గౌతమీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు వృత్తి విద్యలో భాగంగా ఆటోమోటివ్ ట్రేడ్ పారిశ్రామిక సందర్శన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒకేషనల్ ఉపాధ్యాయుడు వై.యస్. రాజు పర్యవేక్షణలో విద్యార్థులు రామచంద్రపురం రోడ్‌లోని విజయ్ కార్ కేర్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ వివిధ రకాల కార్లు, ఇంజన్ పనితీరు, విడిభాగాల ప్రాముఖ్యతపై వర్క్‌షాప్ నిపుణులు, సిబ్బంది విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు.
సర్వీస్ సెంటర్ ప్రధాన నిపుణుడు మాట్లాడుతూ ప్రస్తుతం ఆటోమోటివ్ రంగంలో ఉన్న విస్తృత ఉపాధి, అభివృద్ధి అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దంటు శ్రీనివాసు, ఉపాధ్యాయులు వై.యస్. రాజు, ఐ. వికాస్, కే. మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.