ఏపీలో 41 పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల :
AP: రాష్ట్రంలో 41 అర్బన్ బాడీలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు 12 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు సహా 12 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది.
రాష్ట్ర ప్రగతికి శాంతి భద్రతలు పునాది : మంత్రి అచ్చెన్నాయుడు :
AP : రాష్ట్ర ప్రగతికి శాంతి భద్రతలు పునాది అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ పరిధిలో ఉంటుందని, అందుకే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 నెలల కఠిన శిక్షణ పూర్తి చేసిన 142 మంది కానిస్టేబుళ్లను అభినందించి, పోలీసు సేవల్లోకి అడుగుపెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ కసరత్తు పూర్తి :
TG: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సంపత్‌కుమార్, సామ రామ్మోహన్‌రెడ్డి, గౌరీ సతీష్ పేర్లను అధిష్టానానికి పంపింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి పీవీ శ్రీనివాస్, సర్వోత్తమరెడ్డి, చనగాని దయాకర్‌గౌడ్ పేర్లను ప్రతిపాదించింది. తుది నిర్ణయం అధిష్టానం తీసుకోనుంది.
వివేకా హత్య కేసులో రెండో రోజు విచారణ :
AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పేర్కొంటున్న కీలక ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దస్తగిరి, సునీల్ యాదవ్‌లను విచారించిన ఈడీ.. వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఎర్ర గంగిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
వచ్చే 20 ఏళ్లు దేశానికి చాలా ముఖ్యం : సీఎం చంద్రబాబు :
AP: ఉద్యోగులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ శిక్షణలు అవసరమన్నారు సీఎం చంద్రబాబు. వచ్చే 20 ఏళ్లు దేశానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎన్నో మార్పులను చూశానని తెలిపారు. నైపుణ్యం కలిగిన యువతే దేశానికి బలమన్నారు. 45 ఏళ్లలో చైనా సూపర్ కంట్రీగా ఎదిగిందని, భారత్ ఎందుకు వెనుకబడి ఉందో మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఒంగోలు చేరుకున్న వైఎస్ జగన్ :
AP: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఒంగోలు చేరుకున్నారు. ఆయన రాకతో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇటీవల మృతి చెందిన పార్టీ దళిత నేత కాకుమాను రాజశేఖర్ నివాసానికి జగన్ వెళ్లనున్నారు. కాకుమాను రాజశేఖర్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించి, వారికి సానుభూతి తెలియజేయనున్నారు.:
ఎల్‌నినో ఉన్నా కృష్ణా జలాలను తరలిస్తున్నాం : మంత్రి నిమ్మల
AP: సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లోనూ కృష్ణా జలాలను తరలిస్తున్నామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి 7 టీఎంసీల నీటిని నిల్వ చేశామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల్లో వెలుగొండ కల్పతరువుగా మారిందన్నారు. నల్లమలసాగర్ నుంచి ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ద్వారా ఉదయగిరికి ప్రయోజనం కలుగుతోందన్నారు. రాయలసీమను రూ.20 వేల కోట్లతో హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఓటు చోరీకి వ్యతిరేకంగా తీర్మానం :
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు హాజరయ్యారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేయనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ అంశాలపై కూడా చర్చించనున్నారు.
కల్తీ మద్యం పేరుతో వైసీపీ దుష్ప్రచారం : మంత్రి కొల్లు
AP: కల్తీ మద్యం పేరుతో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. మద్యం బాటిల్ ప్రామాణికత తెలుసుకునేందుకు మూతపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను ఎక్సైజ్ సురక్ష యాప్‌లో స్కాన్ చేయాలని సూచించారు. 2026-27లో 3,652 మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించగా.. 2,929 దుకాణాల రెన్యూవల్‌కు దరఖాస్తులు వచ్చాయన్నారు. అక్టోబర్ 5న కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయిస్తామని వెల్లడించారు.
బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం :
బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల కొత్త ఇన్‌ఛార్జ్‌లతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రానున్న అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ యూనిట్ల మధ్య సమన్వయం, భవిష్యత్ కార్యక్రమాల రోడ్‌మ్యాప్‌పై చర్చించారు.
సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం..!
అమరావతి : ఆందోళనల్లో పాల్గొన్న 45 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం. ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన 45 మందిని గుర్తించిన పోలీసులు. 45 మందిపై కేసులు నమోదు చేయాలని భావిస్తున్న పోలీసులు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని నిర్ణయం.