
మండపేట :
ది మండపేట మోటార్ మెకానికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకదుర్గారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
అనంతరం పతివాడ నూకదుర్గారాణి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా మండపేటలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గణపతి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం గణపతి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.