కాకినాడ :

శరన్నవరాత్రి ఉత్సవములు సందర్భముగా శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం లో 9 వ రోజు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు రాజ రాజేశ్వరి దేవి అలంకరణ లో భక్తులకు దర్శనం ఇచ్చారు.ఈవో బల్ల నీలకంఠం ఆధ్వర్యంలో అర్చకులు అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమములలో దేవస్థానం ఛైర్మెన్ కంటే జగదీష్ మోహనరావు (బాబు) మరియు ధర్మకర్తల మండలి సభ్యులు చీమలకొండ వీరభద్ర ప్రసాదరావు, తాతపూడి సత్య అరుణ్ వంశీ, గొల్తి సత్యనారాయణ,తాతపూడి పవన్ కుమార్, అలోక్ చంద్రజైన్,కంచర్ల సుష్మ మోహిని, కొండపల్లి సత్యవాణి,మందపల్లి భాను వెంకట పద్మ, బాడితిమాని లక్ష్మి త్రిమూర్తులు, గోనిపాటి బుల్లమ్మ మరియు దేవస్థానం అర్చకులు, వేద పండితులు, ఋత్వికులు, దేవస్థానం సిబ్బంది, పాల్గొన్నారు.